!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 302-304
॥ఓమ్ తత్ సత్॥
వివేక చూడామణి 302-304 శ్లోకములు:
గురువు ఇంకా అహంకారము వదలాలి అన్నమాట మీద
ఉదాహరణలతో చెపుతాడు. అహంకారము బ్రహ్మాత్వానికి అడ్డు.
బ్రహ్మానందము అనే నిధికి అడ్డు. యోగులకు కూడా ముక్తికి
అడ్డు అని ఈ మూడు శ్లోకాలలో చెపుతాడు
శ్లోకము 302
యో వా పురైషోఽహమితి ప్రతీతః
బుద్ధ్యావివిక్తః తమసాతి మూఢయా
తస్యైవ నిశ్శేషతయా వినాశే
బ్రహ్మాత్మ భావః ప్రతిబన్ధశూన్యః॥
1 యో వా పురైషోఽహమితి ప్రతీతః-
యో వా పురా ఏష అహం ఇతి ప్రతీతః
ఏదైతే పూర్వ కాలములో "నేను" అని
ప్రశిద్ధి చెందినదో
ఆ ఆహం ఎందువలన పూర్వకాలము లో ప్రశిద్ధి
పొందినది?
2 బుద్ధ్యావివిక్తః తమసాతి మూఢయా
బుద్ధ్యా అవివిక్తః - బుద్దిచేత
గ్రహింపగ్రహింపబడక పోవడము వలన;
తమసా అతిమూఢయా - తమస్సుయొక్క అజ్ఞానము వలన;
3 తస్యైవ నిశ్శేషతయా వినాశే -
తస్య నిశ్శేషతయా వినాశే ఏవ
దానిని ( ఆ అహం ను) నిశ్శేషముగా
వినాశము చేయుటవలననే;
4 బ్రహ్మాత్మ భావః ప్రతిబన్ధశూన్యః -
బ్రహ్మత్వ భావానికి అడ్డంకులు శూన్యమగును
302 వ శ్లోకతాత్పర్యము:
"ఏదైతే పూర్వ కాలములో , బుద్దిచేత గ్రహింపగ్రహింపబడక
పోవడము వలన
తమస్సుయొక్క అజ్ఞానము వలన"నేను" అని ప్రశిద్ధి
చెందినదో, దానిని ( ఆ అహం ను)
నిశ్శేషముగా వినాశము చేయుటవలననే బ్రహ్మత్వ
భావానికి అడ్డంకులు శూన్యమగును."
బ్రహ్మత్వము కావాలి అంటే అహంకారము ఒక్ పెద్ద అడ్డు.
శ్లోకము 303
బ్రహ్మానన్దనిధిః మహాబలవతా అహంకార ఘోరాహినా
సంవేష్ట్యాత్మని రక్షతే గుణమయైః
చణ్డైస్త్రిభిర్మస్తకైః।
విజ్ఞానాఖ్యమహాసినా ద్యుతిమతా విచ్ఛిద్యశీర్షత్రయం
నిర్మూల్యాహి మిమం నిధిం సుఖకరం ధీరోఽనుభోక్తుం క్షమః॥
1 బ్రహ్మానన్దనిధిః - బ్రహ్మానందము అనే నిధి;
మహాబలవతా అహంకార ఘోరాహినా-
మహాబలము కల అహంకారమనెడి ఘోర సర్పముచే
2 గుణమయైః చణ్డైస్త్రిభిర్మస్తకైః - తీవ్రమైన గుణములు
కల తన మూడు తలలతో
సంవేష్ట్య రక్షతే - చుట్టబడి
రక్షింపబడుచున్నది
బ్రహ్మానందము అనే నిధి, తీవ్రమైన గుణములు కల మూడు తల
మహా బలవత్తరమైన పాముచే రక్షింపబడుతున్నది.
గురువు ఉదాహరణద్వారా మనకి విశదీకరిస్తున్న్నాడు.
బ్రహ్మానందము అనేది జీవుడికి ముక్తి, మోక్షము , పరమ
శాంతి. అవన్నీ జీవుడికి అందకుండా వుండడానికి -
అహంకారము అనే మూడు తలల పాము కాపలాకాస్తున్నది అన్నమాట.
ఆ మూడు తలలు రజోతామస సాత్విక గుణాలు. ఆ మూడు తలల
పాముని వదిలించుకుంటేనే ఆ బ్రహ్మానందము అనే నిధి
దొరుకుతుంది.
దానికి ఏమి చెయ్యాలి ? ఆ పాము మూడు తలలని నరికి
పారెయ్యాలి. అదే మాట వింటాము.
3 విజ్ఞానాఖ్యమహాసినా ద్యుతిమతా విచ్ఛిద్యశీర్షత్రయం-
విజ్ఞానాఖ్యమహాసినా ద్యుతిమతా-
విజ్ఞానమనెడి కాంతిగల పదునైన కత్తితో
విచ్ఛిద్యశీర్షత్రయం - ఆ మూడు తలలను
ఛేదించి
ఇక్కడ విజ్ఞానము అనడములో నిదిధ్యాసలవలన కలిగిన
అనుభవపూర్వక జ్ఞానము - ఆ జ్ఞానమే గుణములను ఛేదించగలదు
అన్నమాట
4 నిర్మూల్య అహిం ఇమం నిధిం సుఖకరం
ధీరోఽనుభోక్తుం క్షమః ।
నిర్మూల్య అహిం - ఆ అహంకారమనే పామును
నిర్మూలించి
ఇమం నిధిం సుఖకరం - సుఖకరమైన ఈ నిధిని
ధీరోఽనుభోక్తుం క్షమః - ధీరుడు
అనుభవించుటకు సమర్థుడు
ఆ అహంకారమనే పాముని నిర్మూలించగలిగిన ధీరుడే సుఖకరమైన
బ్రహ్మానందము అనబడే నిధిని అనుభవించ సమర్థుడు అని
తాత్పర్యము.
303వ శ్లోకతాత్పర్యము:
"బ్రహ్మానందము అనే నిధి, మహాబలము కల అహంకారమనెడి
తీవ్రమైన గుణములు కల మూడు తలల ఘోర సర్పముచే
చుట్టబడి రక్షింపబడుచున్నది. విజ్ఞానమనెడి కాంతిగల
పదునైన కత్తితో ఆ మూడు తలలను ఛేదించి, ఆ అహంకారమనే
పాముని నిర్మూలించగలిగిన ధీరుడే సుఖకరమైన బ్రహ్మానందము
అనబడే నిధిని అనుభవించ సమర్థుడు"
బ్రహ్మానందము , పరమ శాంతికోరే వారికి అహంకారమే అడ్డు.
శ్లోకము 304
యావత్ కించిత్ విషదోష
స్ఫూర్తిః అస్తిచేత్ దేహే
కథం ఆరోగ్యయా భవేత్
తద్వత్ అహనాస్తి యోగినో ముక్త్యై॥
యావత్ కించిత్ విషదోష -
ఏమైన కొంచెము విష దోషము
స్ఫూర్తిః అస్తిచేత్ దేహే -
దేహములో వున్నప్పుడు
కథం ఆరోగ్యయా భవేత్ -
ఏలా అరోగ్యము వస్తుంది?
తద్వత్ అహనాస్తి -
అలాగే అహంకారము వుంటే
యోగినో ముక్త్యై -
యోగులకు కూడా ముక్తి ఎలాగ?
304 వ శ్లోక తాత్పర్యము:
"ఏమైన కొంచెము విష దోషము దేహములో వున్నప్పుడు ఏలా
అరోగ్యము వస్తుంది?
అలాగే అహంకారము వుంటే యోగులకు కూడా ముక్తి ఎలాగ?"
అంటే అహంకారము వుంటే యోగులకు కూడా ముక్తి లేదు.
అహంకారమనేది ఘోరమైన మూడు తలలపాము. దానిని నరికి
పారవేస్తేనే ముక్తి, బ్రహ్మానందము
॥ఓమ్ తత్ సత్॥
__________________________________________________
______________________________________________